నేడు ఢిల్లీకి సీఎం చంద్ర‌బాబు

 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్ల‌నున్నారు. గురువారం నాడు క‌న్నుమూసిన క‌మ్యూనిస్టు దిగ్గ‌జం, సీపీఐ(ఎం) జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి పార్థివ‌దేహానికి చంద్రబాబు నివాళులు అర్పించ‌నున్నారు. ఇవాళ రాత్రి అక్క‌డే బ‌స చేసి, రేపు ఉద‌యం హైద‌రాబాద్ తిరిగి రానున్నారు. 

చంద్రబాబు కాసేప‌ట్లో ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌రేట్‌లో అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం అనంత‌రం గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి చేరుకుంటారు. అక్క‌డి నుంచి ఢిల్లీకి బ‌య‌ల్దేరుతారు.

CM Chandrababu Naidu
Andhra Pradesh
New Delhi
Sitaram Yechury

More Telugu News